ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
అంజుమన్ మొహబ్బానే ఏ ఉర్దూ సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ, శుక్రవారం రాత్రి 9 గంటలకు సిద్దిపేటలోని మదీనా ఫంక్షన్ హాల్‌లో 48వ అంతర్జాతీయ కవుల సమ్మేళనం (ముషాయిరా) నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సయ్యద్ మిష్కిన్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రారంభిస్తారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, డాక్టర్ సతీష్, వేలేటి రాధాకృష్ణ శర్మ, ఉబైద్ అలీ సాబ్రీ, జుబేర్ హుస్సేన్, ఫియాజ్ నిజాముద్దీన్ అన్సారీ (ముంబై), తాజ్ అహ్మద్ ఖాన్ గౌరవ అతిథులుగా పాల్గొంటారన్నారు
దుబాయ్ నుండి డాక్టర్ జుబైర్ ఫరూక్ అల్ అర్షీ, మస్కట్ నుండి యాహ్యా ఖాన్ తో పాటు ఆగ్రా, అలీఘర్, ముంబై, హైదరాబాద్ తెలంగాణ జిల్లాల నుండి పలువురు హాస్య గంభీర ముషాయిరాలు వినిపించే కవులు హాజరవుతారన్నారు.ఈ కార్యక్రమానికి కవితాభిమానులు పెద్ద సంఖ్యలో రావాలని కన్వీనర్ ఫక్రుద్దీన్, ప్రధాన కార్యదర్శి ముజఫర్ ఆరిఫ్ కోరారు. గతంలో కేసీఆర్ , గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రముఖ వార్తాపత్రికల సంపాదకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. విరామం లేకుండా నిరంతరంగా నిర్వహించడంలో సిద్దిపేట ముషాయిరా ఉర్దూ ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.