Take a fresh look at your lifestyle.

వంగూరు మండలంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా నాలుగవ కార్యవర్గ సమావేశం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: జిల్లా అధ్యక్షుడు పి. విజయ్‌కుమార్

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

వంగూరు మండలంలోని కోనేటిపూర్ శివారులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా నాలుగవ కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు పి. విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు.

ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కార్యవర్గ సభ్యులు విస్తృతంగా చర్చించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ వివరించగా, వాటి అమలుపై సమీక్ష నిర్వహించారు. జర్నలిస్టుల సామూహిక ఇన్సూరెన్స్, సంక్షేమ నిధి ఏర్పాటు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుకు తీర్మానం ఆమోదించారు.

అలాగే, రాబోయే రోజుల్లో నియోజకవర్గాల వారీగా చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుని ఎన్నిక ఇంకా జరగనందున, డివిజన్ కార్యదర్శిగా ఎన్నికైన కస్తూరి శ్రీనివాస్‌ను తాత్కాలిక డివిజన్ అధ్యక్షుడిగా జిల్లా కమిటీ నియమిస్తూ తీర్మానం చేసింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి. విజయ్‌కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జువ్వ కృష్ణయ్య, సీనియర్ రిపోర్టర్ సురేష్, ప్రచార కార్యదర్శి పట్టాభి, జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.