(ముద్ర ప్రతినిధి – ఉమ్మడిరంగారెడ్డి జిల్లా): గురువారం రాజేందర్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట రాజేందర్ నగర్ తహశీల్దార్, వేర్ హౌస్ ఇంచార్జీ రాములు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.