Take a fresh look at your lifestyle.

భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: రూ.1 కోటి 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు మరియు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.శేరిలింగంపల్లి మరియు కొండాపూర్ డివిజన్ల పరిధిలోని మసీదు బండ, రామ్ నగర్ ఎ బ్లాక్ మరియు రాఘవేంద్ర కాలనీలలో రూ. 1 ఒక కోటి 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు మరియు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్ మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో ఈ రోజు మసీదు బండ, రామ్ నగర్ బ్లాక్ మరియు రాఘవేంద్ర కాలనీలలో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయంచైర్మన్ గాంధీ తెలియచేసారు.అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని చైర్మన్ గాంధీ తెలియచేశారు.ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి గాని ,కార్పొరేటర్ గార్ల దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారుల మేనేజర్ సందీప్ మరియు నాయకులు కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.