ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలో జరుగుతున్న పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరలిని కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు.జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసారు.36 పోలింగ్ కేంద్రాలలో గ్రాడ్యుయేట్స్,14 పోలింగ్ కేంద్రాలలో టీచర్స్ తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారని తెలిపారు.జిల్లాలో దాదాపు 31 వేల గ్రాడ్యుయేట్ ఓటర్స్,1100 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారని,7 రూట్ లలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్న రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లను తరలించడం జరుగుతుందన్నారు.ఎన్నికల కోసం అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లంతా పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజయ్య పాల్గొన్నారు.