Take a fresh look at your lifestyle.

పదేండ్ల ఉత్తమ చిత్రాలకు గద్దర్ అవార్డులు

  • బలగం.. బాహుబలి.
  • 2014 నుంచి 2023 వరకు సినిమా గద్దర్​ అవార్డులు.
  • బాలకృష్ణకు ప్రత్యేక అవార్డు.
  • విజయ దేవరకొండకు కాంతారావు అవార్డు.
  • అవార్డులను ప్రకటించిన మురళీమోహన్​.

ముద్ర, సినిమా ప్రతినిధి : టాలీవుడ్​ సినిమాలకు అవార్డుల ప్రకటనలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచే అవార్డులు ఆగిపోగా.. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా గతేడాది సినిమాలకు అవార్డులు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులను సినీ నటుడు మురళీమోహన్‌ శుక్రవారం ఉదయం వెల్లడించారు. 2014 సంవత్సరానికి గాను ఉత్తమ తొలి చిత్రంగా రన్ రాజా రాన్‌ ఎంపికైంది. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్​ అవార్డు వరించింది. నటుడు విజయ దేవరకొండకు కాంతారావు అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ అవార్డులను ప్రకటించారు. 2014 నుంచి 23 వరకు ఏడాదికి ఒకటి చొప్పున బెస్ట్ ఫిల్మ్స్‌కు పురస్కారాలు ప్రకటించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన మూవీస్ లిస్ట్‌లో తీసుకున్నారు. ప్రతి ఏటా 3 సినిమాలకు అవార్డులు ప్రకటించారు.

దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ గద్దర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి సంబంధించి గద్దర్ అవార్డులను గురువారం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ మీడియా సమావేశంలో అవార్డులు ప్రకటించారు. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా.. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’, సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘పొట్టేల్’, థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా’లక్కీ భాస్కర్’ మూవీస్ ను అవార్డులు వరించాయి. తాజాగా 2014 జూన్ 2 నుంచి అంతే తెలంగాణ రాష్టం ఆవిర్భావ దినం నుంచి సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తీసుకున్నట్లు మురళీమోహన్ తెలిపారు.  ఉత్తమ చిత్రాలతో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు మురళీమోహన్ ప్రకటించారు.

  • 2014
  1. ఉత్తమ తొలి చిత్రం రన్ రాజా రన్‌
  2. ఉత్తమ రెండో చిత్రం పాఠశాల
  3. మూడో రెండో చిత్రం అల్లుడు శీను
  • 2015
  1. ఉత్తమ తొలి చిత్రం రుద్రమదేవి
  2. ఉత్తమ రెండో చిత్రం కంచె
  3. ఉత్తమ మూడో చిత్రం శ్రీమంతుడు
  • 2016
  1. ఉత్తమ తొలి చిత్రం శతమానం భవతి
  2. ఉత్తమ రెండో చిత్రం పెళ్లిచూపులు
  3. ఉత్తమ మూడో చిత్రం జనతా గ్యారేజ్‌
  • 2017
  1. ఉత్తమ తొలి చిత్రం బాహుబలి-2
  2. ఉత్తమ రెండో చిత్రం ఫిదా
  3. ఉత్తమ మూడో చిత్రం ఘాజీ
  • 2018
  1. ఉత్తమ తొలి చిత్రం మహానటి
  2. ఉత్తమ రెండో చిత్రం రంగస్థలం
  3. ఉత్తమ మూడో చిత్రం కేరాఫ్‌ కంచరపాలెం
  • 2019
  1. ఉత్తమ తొలి చిత్రం మహర్షి
  2. ఉత్తమ రెండో చిత్రం జెర్సీ
  3. ఉత్తమ మూడో చిత్రం మల్లేశం
  • 2020
  1. ఉత్తమ తొలి చిత్రం అల వైకుంఠపురంలో..
  2. ఉత్తమ రెండో చిత్రం కలర్ ఫొటో
  3. ఉత్తమ మూడో చిత్రం మిడిల్‌క్లాస్ మెలొడీస్‌
  • 2021
  1. ఉత్తమ తొలి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌
  2. ఉత్తమ రెండో చిత్రం అఖండ
  3. ఉత్తమ మూడో చిత్రం ఉప్పెన
  • 2022
  1. ఉత్తమ తొలి చిత్రం సీతారామం
  2. ఉత్తమ రెండో చిత్రం కార్తికేయ-2
  3. ఉత్తమ మూడో చిత్రం మేజర్‌
  • 2023
  1. ఉత్తమ తొలి చిత్రం బలగం
  2. ఉత్తమ రెండో చిత్రం హనుమాన్‌
  3. ఉత్తమ మూడో చిత్రం భగవంత్ కేసరి
  • ప్రత్యేక అవార్డులు
  1. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు.
  2. నటుడు విజయ దేవరకొండకు కాంతారావు ఫిలిం అవార్డు.
  3. మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు.
  4. సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిలిం అవార్డు.
  5. అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు.
  6. యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు.
  7. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు.

Leave A Reply

Your email address will not be published.