Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ చెల్లని రూపాయి

  • తెలంగాణ సమాజం బీఆర్ఎస్‌ను వద్దనుకుంటుంది.
  • జనం గుండెళ్ళో బీఆర్ఎస్‌కు స్థానం లేదు.
  • మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ ఫ్యామిలీ ప్రయత్నం.
  • చిట్ చాట్‌లు కాదు కవితకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టాలి.
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సమాజం బీఆర్ఎస్‌ను వద్దనుకుందని, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి చెల్లని రూపాయిగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.టీఆర్‌ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చిన రోజే ప్రజలు ఈ రెండు పార్టీలకు కలిపి ‘వీఆర్ఎస్’ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్‌కే పరిమితమైతే మంచిదని ఆయన సూచించారు.ఈ మేరకు శుక్రవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు..తెలంగాణలో చెల్లని రూపాయిగా మారిన కేసీఆర్ ఫ్యామిలీ మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. ఏదో ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు హడావిడి చేస్తున్నారని, తమ ఫ్యామిలీ తప్ప వేరేవాళ్లు ఉండొద్దని కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తోందని ఆయన విమర్శించారు. అమరుడు శ్రీకాంతాచారికి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని, ఎంతోమంది తెలంగాణ అమరులకు బీఆర్ఎస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.ఏ అమరుడి కుటుంబాన్ని కవిత పరామర్శించలేదని, పదేళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది కుటుంబాలతో ఆడుకున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవలేదని అన్నారు. చచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసేందుకు కేటీఆర్, కవిత బ్రాండింగ్ చేసుకుంటున్నారని అన్నారు.బతుకమ్మ చరిత్రలో ఉందని, కవిత బతుకమ్మ ఆడితే వచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టించారని, డ్రోన్లు ఎగరేశారని అరెస్టులు చేయించారని ఎంపీ రఘనందన్ గుర్తు చేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరిగాయనీ ఒక్కసారి, కేసీఆరే మా నాయకుడని మరోసారి ఎమ్మెల్సీ కవిత రెండు స్టేట్ మెంట్లు ఇచ్చారని, బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ చెత్త పంచాయతీలని రఘునందన్ మండిపడ్డారు.బీజేపీ ప్రజలు మనస్సు గెలిచిందని, పైసలు పంచి గెలవలేదని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరగలేదని, కవిత చిట్ చాట్ లు చేసుడు ఎందుకు? ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టాలని ఎంపీ రఘనందన్ సవాల్ విసిరారు. కుటుంబ పంచాయతీని మీరు మీరు తేల్చుకోవాలి తప్పితే బీజేపీని వివాదాల్లోకి లాగొద్దని ఆయన అన్నారు. హరీష్ రావు బీజేపీ కోవర్టు అయితే మంత్రి వర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. అపట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు తన కుమార్తె ఆసుపత్రిని ప్రారంభించారని, హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని అన్నారు. జనం గుండెల్లో బీఆర్ఎస్‌కు స్థానం లేదని, జాగ కోసం కోట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ బలహీనపడాలి కోరుకునేవారే కవిత వెనక ఉన్నారని, కవిత పార్టీ పెడుతుందని తనకు సమాచారం ఉందని అన్నారు. బీఆర్ఎస్‌కు అభ్యర్ధులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, కోవర్టు పని చేసే వాళ్లు బీజేపీలో ఉండరని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.