Take a fresh look at your lifestyle.

మెడిసినల్ కెమిస్ట్రీ” పుస్తకం ఆవిష్కరణ

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

మారుతున్న విద్య విషయ ప్రణాళికాలకు అనుగుణమైన పాఠ్య గ్రంథాలను రచించి ప్రచురించి విద్యార్థులకు అధ్యాపకులు మార్గదర్శకులుగా నిలవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట, ప్రిన్సిపల్ డాక్టర్ జి. సునీత సూచించారు. కళాశాల రసాయన శాస్త్ర విభాగం చెందిన ముగ్గురు అధ్యాపకులు డాక్టర్ ఎం. శ్రీధర్, డాక్టర్ కే భాస్కర్, డాక్టర్ జి. శ్రీనివాస్ సంయుక్తంగా రచించిన “మెడిసినల్ కెమిస్ట్రీ” అనే పాఠ్యపుస్తకాన్ని సోమవారం రోజున ఆమె ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఇలాంటి అకాడమిక్ ప్రయత్నాలు విద్యా ప్రమాణాలను పెంపొందిస్తాయని అన్నారు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాఠ్యపుస్తకాన్ని రచించిన ముగ్గురు రచయితలను అభినందించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ఈ పుస్తకం ప్రత్యేకంగా డిగ్రీ విద్యార్థుల కోసం రూపొందించబడిందని, విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని విషయాలను సిద్ధం చేశామని, ప్రతి అంశాన్ని సరళంగా, స్పష్టంగా తగిన ఉదాహరణతో వివరించామని తెలిపారు. అలాగే ఈ పుస్తకం విద్యార్థులకు తక్కువ సమయంలో ఔషధ రసాయన శాస్త్రాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి నేర్చుకోవడానికి సహాయపడుతుందని తెలియజేశారు.ఈ పుస్తకాన్ని దివ్య లక్ష్మీ పబ్లిషర్స్ అండ్ డిస్ట్రీబ్యూటర్స్  ముద్రించారు. అంతర్జాతీయ ప్రమాణాల సూచీ సంకేతం తో ముద్రించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, సి ఓ ఈ డాక్టర్ గోపాల సుదర్శణం రసాయన శాస్త్ర అధ్యాపకులు ఆంజనేయులు బాలకిషన్, మనోహర్, రవి, మహేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.