ముద్ర, షాద్ నగర్ : ఫరుఖ్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా కార్యక్రమానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి సభ ప్రాంగణాన్ని, వేదికను, ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.