Take a fresh look at your lifestyle.

శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం శ్రీరామనవమి పర్వదిన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ

 

ముద్ర, నారాయణ పేట :

శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శమని….సమాజంలో మంచిని స్వీకరించి చెడును వదిలివేయాలని ఎస్పీ వినీత్ కుమార్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీరామనవమి పర్వదిన ర్యాలీని ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ముందుగా పళ్ళ హనుమాన్ మందిరంలో ఎస్పీ ప్రత్యేక పూజలను చేసి ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్… సత్యనారాయణ చౌరస్తా… యాద్గిరి రోడ్…. అంబేద్కర్ చౌరస్తా…. పాత బస్టాండ్… మహంకాళి వీధి… దూల్పేట్… మోచివాడ… సరాఫ్ బజార్… సుభాష్ రోడ్ వరకు కొనసాగింది. అనంతరం బ్రహ్మనవాడి రామాలయంలో సామూహిక ప్రార్థనలు పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యా యాదవ్, ఏ ఎం సి చైర్మన్ సదాశివరెడ్డి, జి. రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, మురళి భట్టడ్, రఘురామయ్య గౌడ్, ప్రవీణ్, శ్రవణ్, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్, రవికుమార్ గౌడ్, కౌన్సిలర్లు రాజుగట్, కమలాపూర్ ప్రభాకర్, మిర్చి వెంకటయ్య, చిన్న రఘు, కృష్ణ, డాక్టర్ బాలరాజ్, కోట్ల మధు, అనిల్, ఎలక్ట్రిషన్ సందీప్, తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా జిల్లా కేంద్రంలోని మూల హనుమాన్ మందిరంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. అలాగే అప్పిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరుకాగా మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి ఎస్పీ దంపతులను ఘనంగా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.