Take a fresh look at your lifestyle.

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు సర్వీస్ మొత్తం కాపాడుకోవాలి

  • నూతన ఇంజినీర్లకు మంత్రి సీతక్క పిలుపు

ముద్ర, తెలంగాణ బ్యూరో: కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరిన వారు తమ సర్వీస్ మొత్తం కాపాడుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో జీహెచ్ఎంసీ‌లో నూతనంగా నియమించబడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాలేజీల నుండి డైరెక్ట్ గా ఉద్యోగం లోని వచ్చారు కాబట్టి అపారమైన భవిష్యత్ ఉంటుందన్నారు.వచ్చిన ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి సేవలను అందించాలన్నారు. ఇంజనీర్లకు అవసరమైన జి.హెచ్.ఎం.సి గవర్నెన్స్, ఆపరేషనల్ ఫ్రేమ్ వర్క్, స్ట్రక్చర్, రెగ్యులేషన్స్, మున్సిపల్ బడ్జెటింగ్, ఫైనాన్సియల్ మేనేజిమెంట్,అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్, అర్బన్ ప్లానింగ్ డెవలప్ మెంట్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ తదితర విషయాలకు సంబంధించిన సిలబస్ ను రూపొందించామని, ఈ సబ్జక్ట్స్ అన్నీ కూడా సీనియర్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు రిటైర్డ్ ప్రొఫెసర్స్ ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో సర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర రావు, సీనియర్ ఫ్యాకల్టీలు డాక్టర్ చంద్రకళ, డాక్టర్ నరేష్, నాగమల్లేశ్వర రావు పాటుగా బ్యాచ్ 2 చెందిన 30 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.