Take a fresh look at your lifestyle.

సమాజంలో జెండర్ సమానత్వం రావాలి -అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి రాణించాలి – పులుమద్ది సర్పంచ్ శ్వేత

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

సమాజంలో జెండర్ సమానత్వాన్ని తీసుకురావాలని అంతర్జాతీయ గ్రామ సర్పంచ్ శ్వేత అన్నారు. శనివారం మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్వేత మాట్లాడుతూ మా గ్రామపంచాయతీ లో మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.

మహిళలు అన్నిరంగాల్లో రానిస్తున్నప్పటికి సమాజంలో సమానత్వం సాధించలేకపోతున్నామని దీనికి ప్రధాన జెండర్ అసమానతలే కారణమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు విద్య, రాజకీయ రంగాలలో రానించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం మన ఇండ్లల్లో ఆడ, మగ పిల్లలిద్దరికీ అన్ని రకాల ఇంటిపనులు తెలియాల్సి ఉందని సమానత్వం అవగాహనా ఇంటి నుండే ప్రారంభమావ్వాలని చెప్పారు. జెండర్ సమానత్వం కోసం ఎంవీ ఫౌండేషన్ గ్రామంలో చేస్తున్న కార్యక్రమాల వల్ల ఈ రోజు మహిళా దినోత్సవంలో అత్యధిక మహిళలు పాల్గొనడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చని తెలిపారు. ఆడపిల్లలకు చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే గ్రామ పంచాయతి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం వరకట్నం నిషేధ చట్టం, గృహ హింస చట్టం, బాల్య వివాహల నిర్ములన, పని ప్రదేశంలో హింస వ్యతిరేక చట్టం, పోక్సో చట్టం వంటి అనేక చట్టాలు ఉన్నాయని ఈ చట్టాలపై అవగాహనా కలిగి ఉండాలని చెప్పారు. మహిళలకు ఎలాంటి న్యాయ సలహాలు కావాలన్నా అందుబాటులో ఉంటామని చెప్పారు. అనంతరం గ్రామంలో పనిచేస్తున్న వివిధ శాఖల మహిళలలు, బాలికలకు ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శిల్ప, ఉప సర్పంచ్ రాజు, ఏ ఎస్ ఐ ప్రకాష్, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య సభ్యులు ఆర్చిత, ఎంవీఫ్ ప్రతినిధులు శ్రీనివాస్, దేవకుమారి, గ్రామ పెద్దలు శివ్వయ్య, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ కవిత, రేణుక, స్కూల్ చైర్మన్ లక్ష్మి, న్యాయవాది శ్రీనివాస్, విఓఏలు సుజాత, మమత, అధ్యక్షులు లలిత, వార్డ్ సభ్యులు అనిత శోభ, ఆశలత, ఉమాదేవి తదితర మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.