Take a fresh look at your lifestyle.

మున్సిపల్ అభివృద్ధికి అత్యధిక నిధులు తెస్తా -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన వికారాబాద్ పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎక్స్ అఫిషియో హోదాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.


వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఉమా శంకర్, కమీషనర్ విక్రం సింహారెడ్డి, వార్డుల సభ్యులు, అధికారులు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో ప్రజల ఆదరణ, అభిమానంతో విజయం సాధించి బాధ్యతలు స్వీకరించిన పాలక కార్యవర్గానికి ముందుగా నా అభినందనలు. అదేవిధంగా నూతన పాలక వర్గం ఆద్వర్యంలో జరుగుతున్న మొదటి బడ్జెట్ సమావేశం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్ విషయాలపై అవగాహన కోసం త్వరలోనే ప్రొఫెషనల్స్ తో మీకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయిస్తాను‌.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మంత్రి గా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రి, స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డితో మాట్లాడి రూ. 2,300 కోట్లతో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించాను. దేశంలో మొత్తం ఏడు శాటిలైట్ ప్రాజెక్టులు మంజూరు అయితే అందులో ఇది ఒకటి. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారడంతో ఆ నిధులలో మెజారిటీ రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొడంగల్ కు దీటుగా వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాను.
మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాలలో అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తాను‌. పట్టణం పరిధిలో అవసరమైన మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జి లను మంజూరు చేయించడానికి రైల్వే శాఖతో ప్రయత్నాలు చేస్తున్నాను. ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేయిస్తాను‌. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి నిర్మించిన శివసాగర్ చెరువును పూర్తిగా ఆధునికీకరణ చేయిస్తాను‌. హైదరాబాద్ ఎన్టీఆర్ పార్కు తరహాలో ఇక్కడ కూడా పార్కును ఏర్పాటు చేయిస్తాను‌. నిధులు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది, సక్రమంగా అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మన వికారాబాద్ ప్రాంతానికి సాగునీరు తీసుకు రావడానికి ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి పథకాలను తీసుకురావాలని ప్రయత్నం చేశాను. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మన ప్రాంతానికి తీసుకురావాలని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాను.ఈసారి ఖచ్చితంగా విజయం సాదిస్తాం. ఈ పథకం పూర్తయితే మన వికారాబాద్ పట్టణానికి త్రాగునీటితో పాటుగా నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. టీయుఎఫ్ ఐడిసీ 60 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. హెచ్ ఎండిఎ నిధులు 270 కోట్లు త్వరలోనే మంజూరు అవుతాయి. అనంతగిరిని వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మన ప్రాంతంలోని మూడు వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు పట్టణ పరిధిలోని నారాయణపూర్ లో వంద ఎకరాలలో టెక్స్ట్ టైల్స్ పార్కు అభివృద్ధి చేసి నాలుగు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేశాను. గత ప్రభుత్వం పదేళ్ళు పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాను.
పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తాను‌. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరూ మనవాళ్ళే, అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేసి నిధులను సక్రమంగా, సమర్ధవంతంగా ఖర్చు చేసి వికారాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి, నా వంతుగా మీకు పూర్తి సహకారం ఉంటుంది
నేను అందరు రాజకీయ నాయకుల లాంటి వ్యక్తిని కాదు, నాకు ఆదాయం, ఆస్థులపై ఆశ లేదు.
వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి నా లక్ష్యం, మర్రి చెన్నారెడ్డి గారి లాగా ఈ ప్రాంతం అభివృద్ధి పై నా ముద్ర ఉండాలని నా కోరిక అన్నారు. చిన్న వయసులోనే చైర్మన్ అయిన నా కూతురు గడ్డం అనన్య పై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి.
చైర్ పర్సన్ గడ్డం అనన్య గారు మాట్లాడుతూ వార్డుల సభ్యులు చెప్పిన సమస్యలను అన్నింటినీ నేను వ్యక్తిగతంగా నోట్ చేసుకున్నాను. ప్రతి వార్డులో పర్యటించి కామన్ ప్రాబ్లమ్స్ ను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేద్దాం. మీ వార్డులలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది గురించి అవగాహన కలిగి ఉండాలి. తద్వారా ఇబ్బందులు తలెత్తిన సమయంలో వెంటనే సంబంధిత ఉద్యోగిని అప్రోచ్ కావడానికి వీలవుతుంది. స్పీకర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అధికంగా నిధులను తీసుకుని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave A Reply

Your email address will not be published.