కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త రోడ్లు -వికారాబాద్ అభివృద్ధికి అధిక నిధులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్
ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ నూతన హైలెవల్ బ్రిడ్జి శంఖుస్థాపన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు నా శుభాకాంక్షలు తెలిపారు. వానాకాలంలో వరదలు వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నలో లెవల్ బ్రిడ్జిపై నుండి నీళ్ళు పోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు ఉంటున్నాయి. గతంలో వరదలకు లో లెవల్ బ్రిడ్జి కొట్టుకుపోయిన సందర్భంలో ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. ఈ కష్టాలు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడి ఇక్కడ హై లెవల్ బ్రిడ్జి నిర్మించడానికి 27 కోట్ల యాబై లక్షలు మంజూరు చేయించాను. పనులను త్వరగా పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ధన్యావాదాలు తెలిపిన స్పీకర్. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ పల్లి రిజర్వాయర్ ను నిర్మించారు. మొత్తం 9000 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కాగా, ప్రస్తుతం కేవలం 3000 ఎకరాలకు మాత్రమే నీరందిస్తుంది. కోట్ పల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు 90 కోట్లు మంజూరు చేయించాను, పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తయిన తరువాత మొత్తం ఆయకట్టు లోని రైతుల పొలాలకు సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 600 కోట్లతో కొత్త రోడ్లు వేయిస్తున్నానన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన జిల్లా నుంచే ఉండడం, నేను స్పీకర్ హోదాలో ఉండడంతో వికారాబాద్ కు నిధులు ఎక్కువగా వస్తున్నాయి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్ అండ్ బి సీఇ వసంత నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు, సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ధారూర్ రైతు వేదిక ఆవరణలో 5 రోజుల పాటు 286 మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా స్పీకర్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అందరి సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఎలాంటి సమస్యలను అయిన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా సహకరిస్తానని స్పీకర్ తెలిపారు.