కోరుట్ల, ముద్ర: పదవ తరగతి ఫలితాల్లో లిటిల్ జీనియస్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి, ర్యాంకుల సునామిని సృష్టించారు.ఈ పాఠశాలకి చెందిన విద్యార్థిని సూరినేని ఇందు 588 మార్కులు సాధించి కోరుట్ల పట్టణంలో ప్రథమ స్థానం రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకు సాధించారు. పాఠశాలలోని ఇతర విద్యార్థులు ఫరాజ్ అహ్మద్ సిద్ధికి 571, దొంతుల మాల్య వర్షిత 569,మదిహా సయీద్ 564, ముక్కెర అక్షయ 558, జోనఫలక్ 553, జవాయి సాహితి 550 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. లిటిల్ జీనియస్ హై స్కూల్ నుండి 90 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా అందరూ ఉత్తీర్ణత సాధించడం ద్వారా 100% ఫలితాలు వచ్చాయి.అందులో 48 మంది విద్యార్థులు 500 కి పైగా మార్కులు సాధించటం గర్వకారణమని, ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థులను, దీనికి కారకులైన ఉపాధ్యాయులను, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థిని సూరినేని ఇందు ను పాఠశాల కరెస్పాండంట్ బండి మహాదేవ్, హై స్కూల్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, డైరెక్టర్ కొత్త రాజు, అకాడమిక్ అడ్వైజర్ కటుకం శంకర్ శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వినోద, ప్రీ ప్రైమరీ ప్రిన్సిపాల్ కటుకం సంధ్య రాణి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.