Take a fresh look at your lifestyle.

ఓసీపీ.1 లో అమ్మవారికి ప్రత్యేక పూజలు

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆదివారం సింగరేణి రామగుండం ఓసిపి.1 ప్రాజెక్టు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు కోడూరి శ్రీనివాసచార్యులు అమ్మవారికి వస్త్రాలంకరణ, పంచామృత అభిషేకంతో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో స్థానిక ఉద్యోగులు భక్తజనులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.