Take a fresh look at your lifestyle.

ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రం ప్రారంభం.-మహిళలకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయం. మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర ,మోత్కూర్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పోచం సత్తయ్య -కిష్టమ్మ ల జ్ఞాపకార్థం ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి కేంద్రంను
మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇట్టి సద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఉచితంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లను పోచం నారాయణ శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి,నిర్వాహకులు పోచం నారాయణ,వార్డ్ కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న,కూర్మిళ్ల ప్రమీల, గనగాని శైలజ,పన్నాల శ్రీవిద్య,మెంట రమణ, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,మాజీ కో ఆప్షన్ సభ్యులు గనగాని నర్సయ్య,లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.