- చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభం.
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో సినీనటి వైష్ణవిచైతన్య సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన
సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవం చేశారు. అందరికి అందుబాటులో ఉండేలా షాపింగ్ మాల్ మెదక్ లో ప్రారంభించబడం ఎంతో సంతోషదాయకరమన్నారు.షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాల అనుబంద సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నారు. మెదక్ లో షోరూం తీర్చిదిద్దడంలో, ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రాలు ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడంవలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామన్నారు. అన్ని ఆదాయ వర్గాలకూ అందుబాటు ధరలలో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలనూ అలానే మోడ్రన్ ఫ్యాషన్లనందించడంలో మరింత ముందుటామని పేర్కొన్నారు. జబర్దస్త్ టీం సభ్యులు వర్ష, ఇతర సభ్యులు రైజింగ్ రాజు, నూకరాజు, ఫైమా, దొరబాబు సందడి చేశారు.
- వ్యాపారం అభివృద్ధి చెందాలి: మైనంపల్లి
మెదక్ పట్టణంలో వ్యాపారం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మెదక్ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రపాల్ తదితరులు ఉన్నారు.
