ముద్ర కరీంనగర్ :
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కోలగాని శ్రీనివాస్ , మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన యాదగిరి సునీల్ రావు గారిని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారిద్దరికీ శాలువా, పూలబుకే అందజేసి సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో వారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కు టీఎన్జీవోల సంఘం 2026 డైరీ ని కూడా అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగేం లక్షణ్ రావు రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి రాగి శ్రీనివాస్ జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ రూరల్ అధ్యక్షులు కోడూరి వాస్తావిక్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ నాయకులు శ్రీనివాస్ అశోక్ ముత్తయ్య మల్క రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.