Take a fresh look at your lifestyle.

సీతారాముల కల్యాణానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న ఆలయాలు

 

శ్రీరామనవమి హిందువుల పవిత్రమైన పండుగ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు

ముద్ర….. తుంగతుర్తి…..

శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాధాన్యత గల పండుగ. శ్రీమహావిష్ణువు ఏడవ అవతారంలో శ్రీరామునిగా చైత్ర శుద్ధ నవమి నాడు వసంత రుతువులో అభిజిత్ ముహూర్తంలో అనగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయోధ్యలో జన్మించిన రోజును ఇది సూచిస్తుంది. ఈరోజున శ్రీరామునికి సీతాదేవికి ప్రత్యేక పూజలు సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే శ్రీరాముడు అరణ్యవాసం అనంతరం అయోధ్య నగరానికి సతి సమేతంగా విచ్చేసి రాజుగా పట్టాభిశక్తుడైనది కూడా ఇది రోజున అని ప్రజల విశ్వాసం. చైత్ర శుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం జరిగింది. అందుకే ఈ చైత్ర శుద్ధ నవమి రోజు సీతారాముల కళ్యాణము ప్రత్యేక పూజలు ప్రజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజున పానకం, వడపప్పు నైవేద్యంగా సీతారాములకు నివేదన చేస్తారు. తెలంగాణలోని అత్యంత ప్రాశస్త్యమైన భద్రాచలంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగ జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. నేటికీ భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి శుక్రవారం రోజున జరుగుతుంది. ఇప్పటికే సీతారాముల కల్యాణానికి ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో అత్యంత పురాతనమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు గాను .సీతారాముల కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు కాటూరి రామాచార్యులు మాట్లాడుతూ 26వ తేదీ గురువారం ఉదయం ఏడు గంటలకు సేవా కాలము ప్రబోధ మంగళ శాసనములు 10 గంటలకు ప్రబంధ పారాయణం మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన మంగళ శాసనము సాయంత్రం ఏడు గంటలకు నమ్మాల్వార్ పరంపదోత్సవం మంగళ శాసనములు అనంతరం తీర్థ ప్రసాదం ఇవ్వబడుతుందని తెలిపారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమవుతుందని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కల్యాణాన్ని వీక్షించి ధన్యులు కావాలని కోరారు .గత ప్రభుత్వ హయాంలో దేవాలయంలో కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది .తెలంగాణలోని భద్రాద్రి సీతారాముల విగ్రహాల తర్వాత అంతటి ప్రాషస్తం కలిగినవి తుంగతుర్తి లోని సీతారాముల విగ్రహాలని అలాగే ఫణిగిరిలోని సీతారామ చంద్రుల విగ్రహాలుగా పూర్వీకులు చెబుతుంటారు. సీతారాముల కళ్యాణం చూడడానికి ప్రజలు అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం ఆయా ఆలయాలకు రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతం గా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించారు సీతారాముల కల్యాణాన్ని వీక్షించి ప్రజలు ధన్యులు కావాలని కోరుకుందాం

Leave A Reply

Your email address will not be published.