- కొమరవెల్లి మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్.
ముద్ర, కొమురవెల్లి : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొవ్వూరు ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు కొమరవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస ఆధ్వర్యంలో గురువన్న పేట తపాస్పల్లి, రసులపద్ గ్రామాల్లో పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ రిజర్వేషన్ ఎవరికి వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలు, ప్రజల వద్దకు చేర్చాలని అలాగే ప్రతి ఇంటి గడపకు తీసుకొని వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.