ముద్ర ప్రతినిధి, భువనగిరి : గత కొన్ని నెలల క్రితం భువనగిరి పట్టణంలో 8వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన రాచమల్ల భార్గవ తేజ ప్రమాదంలో మరణించాడు. భార్గవ తేజ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండగా సభ్యత్వ ఇన్సూరెన్స్ 2,00,000 రూపాయల చెక్కును మంగళవారం భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి భార్గవ తేజ తల్లి సరోజా కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఇట్టబోయిన గోపాల్, మాజీ కౌన్సిలర్ కాజా ఆజీమోద్దీన్, 8వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచమల్ల సుదర్శన్ పాల్గొన్నారు.