ముద్ర నడిగూడెం
మంచి వ్యక్తిత్వం మనసున్న మనిషిని కోల్పోయామని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల పరిధిలోని వల్లాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి రణబోతు బిక్షమారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ వారి స్వగృహానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన మనిషిని కోల్పోవడం బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిచారు అనంతరం అదే గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ కూడా అనారోగ్య కారణంగా మరణించడంతో ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లా నర్సిరెడ్డి మాజీ సర్పంచ్ వట్టికూటి చంద్రయ్య తవణం వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు నూకపంగు ఈదయ్య సింగిల్ విండో మాజీ డైరెక్టర్ వట్టికూటి వెంకన్న జానిమియ రామ నరసయ్య ఖాసిం పుల్లయ్య సంజీవరెడ్డి వెంకట రాములు వెంకటేశ్వర్లు జమాల్ సాహెబ్ నాగుల్ మీరా క్రాంతి కుమార్