Take a fresh look at your lifestyle.

సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత

  • సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల పంపిణి గేమ్ చెంజర్స్ గా అభివర్ణన.
  • 396 కోట్ల రూపాయలతో 10,000 ఎకరాలకి నీరు అందించే రాజీవ్ గాంధీ దొండపాడు-2 లిప్ట్ కి క్యాబి నెట్ ఆమోదం.
  • హుజూర్ నగర్ నియోజకవర్గం ని రాష్టంలోనే నెంబర్ 1 గా చేస్తా.
  • రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి .
  • నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.
  • ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు.
  • రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి, మైనార్టీ, వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్.

సూర్యాపేట ముద్ర ప్రతినిధి : పేదవారికి కడుపు నింపి ఆహార భద్రత కల్పించే సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు పంపిణి కార్యక్రమాలన్ని మించిన సంక్షేమ పథకాలు భారత దేశ చరిత్రలో లేవన్ని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. హుజూర్ నగర్ పట్టణం కౌండిన్య పంక్షన్ హాల్ నందు మంగళవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకి నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలోనే హుజూర్నగర్ నుండి సన్న బియ్యం పంపిణి చేసిన ఉగాది పర్వదినం నిలిచి పోతుందని,అలాగే తిరుమలగిరి నుండి నూతన రేషన్ కార్డులు పంపిణి సూర్యాపేట జిల్లా నుండి గౌరవ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా నుండి ప్రారంభించిన రెండు పథకాలు చరిత్ర లో గేమ్ చెంజర్స్ గా నిల్చిపోతాయని అన్నారు.గతంలో 10,600 కోట్లు ఖర్చు పెట్టి 89.95 లక్షల కార్డులకి 2.80 కోట్ల మందికి దొడ్డు బియ్యం పంపిణి చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అందుకే పేద వారి కడుపు నింపేలా 13,000 కోట్లతో 97.90 లక్షల కార్డులకి 3.10 కోట్ల మందికి కేజీ 57 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం  ఉచితంగా పంపిణి చేస్తున్నామనిఅన్నారు. రైతులకి సన్న వడ్లు పండించేందుకు బోనస్ 500 ఇస్తున్నామని, సన్న వడ్లు సేకరించి మిల్లింగ్ చేసి దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వారు కడుపు నిండా తినేలా రాజకీయాలకి అతీతంగా నూతన కార్డులు,సన్న బియ్యం పంపిణి చేస్తున్నామని తెలిపారు. చింతలపాలెం మండలంలో గతంలో 12,000 కార్డులుంటే 1116 కొత్తగా ఇచ్చామని, గరిడేపల్లి మండలంలో పాతవి 17000 ఉంటే కొత్తవి 2446,హుజూర్నగర్ లో పాతవి 18000, కొత్తవి 2300, మట్టంపల్లి మండలంలో పాతవి 13,800 ఉంటే కొత్తవి 1400,మేళ్లచెర్వులో పాతవి 11,000 ఉంటే కొత్తగా 1200,నేరేడుచర్ల లో పాతవి  11,000 ఉంటే కొత్తగా 1700 అలాగే పాలకీడులో  7000 పాతవి ఉంటే 812 కొత్తవి మొత్తం 11,000 కార్డులు నూతనంగా మంజూరు చేశామని దీని ద్వారా 52,000 మందికి సన్న బియ్యం తినే హక్కు కల్పించామని తెలిపారు.

18 సంవత్సరాల తర్వాత జూలై మాసంలో సాగు నీరు వదలటం జరుగుతుందని నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇందిరా గాంధీ ప్రారంభించారని నేటికీ చెక్కు చెదరలేదు అని తెలి పారు.396 కోట్ల రూపాయలతో 10,000 ఎకరాలకి నీరు అందించే రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ దొండపాడు 2 కి క్యాబినెట్ ఆమోదం తెలపటం జరిగిందని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గం ని రాష్ట్రములోనే నెంబర్ 1 గా చేస్తానని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.ఇంచార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత పదేళ్లు ఒక్క కార్డు, ఇల్లులు ఇవ్వలేదని ఇందిరమ్మ రాజ్యములో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, 200 యూనిట్ల కరెంట్, ఉచిత బస్సు, ఉద్యోగాలు,ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్న  ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదలు ఉండాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో గౌరవ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల కృషితో ప్రతి పేదవారికి ఆహార భద్రత కల్పించే సన్న బియ్యం,నూతన రేషన్ కార్డులు పంపిణి ప్రారంభించటం మన అదృష్టం అని అన్నారు. కార్డులు రాని వారు ఎవరు అందిలోన పడాల్సిన అవసరం లేదు అని అర్హులైన అందరు రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని కలెక్టర్ ఈ సందర్బంగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డి ఎస్ చౌహన్,జిల్లా ఎస్పి కే నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓ శ్రీనివాసులు, డి ఎస్ ఓ మోహన్ బాబు,తహసీల్దార్ లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.