Take a fresh look at your lifestyle.

కుంగిన చోట తాత్కాలిక మరమ్మతులు 

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : సోమవారం రాత్రి కుంగిన క్యాతన్ పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రహదారిపై మంగళవారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సంబంధిత అర్ అండ్ బీ అధికారులు పరిశీలించి గుత్తేదారునికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. గుత్తేదారు తరుఫున సూపర్వైజర్ నేతృత్వంలో కుంగిన రహదారి ప్రదేశంలో డాంబర్,కంకరతో లెవెలింగ్ చేశారు.కాగా బ్రిడ్జి నిర్మించిన కొన్ని రోజుల్లోనే కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రమాదకరంగా మారిన రహదారిపై పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని పుర ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.