Take a fresh look at your lifestyle.

సౌర విద్యుత్ తో ఖర్చు తగ్గించుకోవాలి జెండా ఊపి ప్రచార వాహనం ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్:*
సౌర విద్యుత్ తో చార్జీలు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పిఎం సూర్యఘర్ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలన్నారు.
ఈ వాహనం మెదక్ జిల్లాలోని మండలాలు, గ్రామాలు పర్యటించి పథకం గురించి అవగాహన కల్పించి పథకం యొక్క ప్రయోజనాలను వివరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.