Take a fresh look at your lifestyle.

మొక్కు చెల్లించుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట,ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే మంచి కృష్ణ ఎన్నికల సమయంలో నాయినంపల్లి అమ్మవారికి తనను గెలిపించవలసిందిగా కోరిక కోరుకోవడం జరిగింది.ఆ మొక్కు నేడు తీర్చుకున్నారు.లింగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రంగినేని శ్రీనివాసరావు మరియు కార్యకర్తలు గత అసెంబ్లీ ఎన్నికల ముందు నాయనంపల్లి దేవస్థానంలో మైసమ్మ తల్లిని దర్శించుకొని భారీ మెజార్టీతో అచ్చంపేట శాసనసభ సభ్యులుగా గెలిపించాలని మైసమ్మ తల్లిని వేడుకొనగా మైసమ్మ తల్లి తీర్చిన మొక్కును చెల్లించుకోవడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగీనేని శ్రీనివాసరావు మరియు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో నాయినంపల్లి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు చేశారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా నాయినంపల్లి మైసమ్మ తల్లి అని నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. సకాలంలో వర్షాలు పడాలని పంటలు బాగా పండాలని అందరూ బాగుండాలని ఆ మైసమ్మ తల్లి దగ్గర ప్రత్యేకమైన పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు అన్ని గ్రామాల నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.