మల్యాల,ముద్ర విలేఖరి: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్ చౌరస్తా సోనియా గాంధీ గుడి ముందు సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రతిపక్ష పార్టీ అని, ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్నదాతలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంగ ఆనందరెడ్డి, బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్ గౌడ్, వెలమ లక్ష్మారెడ్డి, దారం ఆదిరెడ్డి, శనిగరపు తిరుపతి, కంచర్ల లక్ష్మణాచారి, నేరెళ్ల సతీష్ రెడ్డి, బివి రమణ, ఎండి. ఇమామ్, మర్రి లక్ష్మణ్, కోరెపు వెంకటేష్, ఆగంతపు వంశీ, బండి రవి, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.