Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐజీ వృద్ధి

  • నూతనంగా మెడికేర్ సెలెక్ట్ ఆవిష్కరణ
  • 1600కుపైగా ఆసుపత్రులతో ప్రాంతీయంగా పటిష్టం.
  • 2025 ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాల్లో 97% క్లెయిమ్ సెటిల్మెంట్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ఏడాది వ్యవధిలో 82,000 పైచిలుకు పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా తమ రిటైల్ హెల్త్ పోర్ట్‌ఫోలియోలో మూడింతల వృద్ధి సాధించినట్లు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వెల్లడించింది. జాతీయ సగటు కన్నా ఆరోగ్య బీమా విస్తృతి తక్కువగా ఉంటున్న దక్షిణాది మార్కెట్లలో విశ్వసనీయమైన బీమా సాధనాలకు పెరుగుతున్న డిమాండ్‌కి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తుందని ప్రకటించింది.ఈ మేరకు హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎజెన్సీ హెడ్​ ప్రతీక్​ గుప్తా, యాక్సిడెంట్​ అండ్​ హెల్త్​ క్లెయిమ్స్​ హెడ్​ రుద్రరాజు రాజగోపాల్​ పలు అంశాలను వెల్లడించారు. టాటా ఏఐజీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరులో కీలక శాఖలను ఏర్పాటు చేసిందని, టాటా ఏఐజీ నెట్‌వర్క్‌ 1,600 పైగా ఆసుపత్రులు, 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వైద్య బీమా సేవల లభ్యతను మరింతగా పెంచే దిశగా కంపెనీ కొత్తగా మెడికేర్ సెలెక్ట్‌ పేరుతో మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండే సరళతరమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 16 శాతానికి పెరిగిందని అన్నారు.నవజాత శిశువుల నుంచి సీనియర్ల వరకు, ఎటువంటి వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ప్రీమియం ఉండేలా మెడికేర్​సెలెక్ట్​ రూపొందించామని అన్నారు.

  • క్యాన్సర్​ ఖర్చు పెరిగింది.

గడిచిన మూడేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే సంఖ్యలో అగ్రస్థానంలో ఉంటున్నాయని, ఖర్చులు 25 శాతం పెరగ్గా, సగటు ట్రీట్‌మెంట్ వ్యయాలు రూ. 1.6 లక్షలకు చేరాయన్నారు. కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ) చికిత్స వ్యయాలు 40% పెరిగాయని, సగటు ఖర్చులు కూడా రూ. 1.6 లక్షలకు చేరుకున్నాయని, 2025లో టాటా ఏఐజీ ఒక కార్డియోవాస్కులర్ కండీషన్‌ కేసుకి సంబంధించి హైదరాబాద్‌లో అత్యధికంగా రూ. 1 కోటి హెల్త్ క్లెయిమ్ చెల్లించిందని ప్రకటించారు. తీవ్రమైన కిడ్నీ డిసీజ్ (సీకేడీ) చికిత్స ఖర్చులు 38% పెరిగాయని, ఇవన్నీ కూడా అత్యవసరంగా అందుబాటు ప్రీమియంలతో హెల్త్‌కేర్ లభ్యత ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయన్నారు.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఈ సేవలను అందించడంపై తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నామని ఏజెన్సీ హెడ్ ప్రతీక్ గుప్తా తెలిపారు. అదే విధంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో మా నగదురహిత సేవల వినియోగం తెలంగాణలో 81 శాతంగా, ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతంగా నమోదైందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లకు ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతను మెరుగుపర్చేందుకు, వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తాము కట్టుబడి ఉన్నామని యాక్సిడెంట్ & హెల్త్ క్లెయిమ్స్ హెడ్​ రుద్రరాజు రాజగోపాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.