Take a fresh look at your lifestyle.

మృతి చెందిన గీతకార్మికుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలో తకళ్ళపెల్లి గ్రామానికి చెందిన దాసరి లచయ్య గౌడ్ (54) చెట్టు మీద నుండి మృతి చెందాడు. అయన కుటుంబాన్ని జగిత్యాల జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు డా. చంద్రశేఖర్ గౌడ్ పరామర్శించి రూ.5 వేల ఆర్ధిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లచయ్య గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు రాజ్ కుమార్ గౌడ్, సాయ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.