Take a fresh look at your lifestyle.

నారాయణపేట జిల్లా ఏర్పాటుకు ఉద్యమాలే కారణం – సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్

పేట జిల్లా ఏర్పాటు ఆషామాషీ కాదు… ఉద్యమాలు చేసి సాధించుకున్న జిల్లా

విలేకరుల సమావేశంలో సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్

బిజెపి ఉద్యమం ద్వారానే జిల్లా ఏర్పాటు

రూ. 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తామని పిచ్చి కూతలు కూయటం కాదు

బిజెపి సీనియర్ నాగురావు నామాజీ

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట జిల్లా ఏర్పాటు ఆషామాషీగా ఏర్పాటు కాలేదని… ఉద్యమాలు చేస్తే సాధించుకున్న జిల్లా అని సేడం మాజీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బిజెపి సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన హిందీలో మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలో బిజెపి అధికారంలో ఉంటేనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. నారాయణపేట పట్టణంలో బిజెపికి మంచి ఆదరణ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపికి ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పాలన చేతకాదని… ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగపోయారన్నారు. నాగురావు నామాజీ మాట్లాడుతూ సీఎం నూట నారాయణపేట జిల్లా పోతుందని మాట వింటున్నామని కనీసం స్థానిక ఎమ్మెల్యేకు మంత్రికి సీఎంతో ఐదు నిమిషాల సమయం తీసుకుని నారాయణపేట జిల్లాపై భరోసా కల్పించే అవకాశం కూడా లేదా అని ప్రశ్నించారు. పట్టణంలో బిజెపి జెండా ఎగిరితే ఆసుపత్రిని తిరిగి జిల్లా కేంద్రానికి తీసుక వస్తామన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లా వద్దని కోరుకున్నట్లేనని ఆరోపించారు. జిల్లాకు వచ్చిన నిధులు, భవనాలు అన్ని వెనక్కి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేటన పట్టణ అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యమన్నారు. బిజెపి పోరాటం వల్లనే జిల్లా ఏర్పాటు అయిందని… కానీ స్థానిక ఆసుపత్రిలో 400 కాన్పుల ఆసుపత్రి రెఫరల్ ఆసుపత్రిగా మారిందని ఆరోపించారు. బిజెపికి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇస్తే ఎంపీ డీకే అరుణ సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రతంగ పాండు రెడ్డి, లక్ష్మీ శ్యాంసుందర్, రఘువీర్, కిరణ్ డగే తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.