ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మహారాణా ప్రతాప్ స్వాతంత్ర్యం, పరాక్రమానికి ప్రతీకగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కొనియాడారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకల్లో అయన పాల్గొన్నారు. ఈ మేరకు మహా రాణాప్రతాప్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మహారాణా ప్రతాప్ తన చివరి శ్వాస వరకు నిరంతరం, ధైర్యంగా పోరాడి శక్తివంతమైన మొఘలులకు లొంగిపోవడానికి పదేపదే నిరాకరించిన వీరుడన్నారు . ఆయన రాజపుత్రుల శౌర్యానికి మరియు పట్టుదలకు ప్రతీకగా నిలిచారు. ఆయన చూపిన ధైర్యసాహసాలకు మరియు చేసిన త్యాగాలకు గాను రాజస్థాన్‌లో ఒక వీరుడిగా కూడా గౌరవించబడ్డ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు కత్తి నరేందర్, నాందేడపు చిన్ను, గోపు గోపి తదితరులు పాల్గొన్నారు.