Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు  అంద చేసిన మంత్రి

ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భముగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన వేడుకల్లో  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు రూ.లు ఆర్థిక సహాయం అందించనుంది.జిల్లాలో మహబూబ్ నగర్,జడ్చర్ల,దేవరకద్ర నియోజకవర్గం, పరిగి నియోజకవర్గం లోని గండేడ్ మండలం లోని లబ్దిదారులకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు  సోమవారం రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 14 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు  అంద చేశారు.అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై పునాది వరకు నిర్మాణం చేసుకున్న 4 గురు లబ్దిదారులకు ఒక్కొకరికి లక్ష రూ. ల చెక్కులను మంత్రి మంజూరు చేశారు.కార్యక్రమ లో శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి,జి.మధు సూధన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి,జిల్లా  కలెక్టర్ విజయేం దిర బోయి,ఎస్.పి.డి.జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి ,గృహ నిర్మాణ పి.డి.వైద్యం భాస్కర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.