Take a fresh look at your lifestyle.

ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజి ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి

  • జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్.

కోరుట్ల, ముద్ర విలేకరి: రాష్ట్ర వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు కోరుట్ల పద్మశాలి సంఘంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పత్రిక పోరాట యోధుడు, జాతీయ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించిన నాయకులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని వారు  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి జిల్లా ధనుంజయ్, రాష్ట్ర నాయకులు గడ్డం మధు, తాజా మాజీ కౌన్సిలర్లు  ఎంబేరి నాగభూషణం, ఆడెపుమధు, జిందం లక్ష్మీనారాయణ, పెండెం గణేష్, సంఘ ఉపాధ్యక్షులు కటుకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందే రాజ్ కుమార్, పద్మశాలి యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్, వేంకటేశ్వర దేవస్థానం డైరెక్టర్ కటుకం దివాకర్, పద్మశాలి సంఘ సభ్యులు, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.