Take a fresh look at your lifestyle.

అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన ఉండాలి -జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సారంగి సందన్న

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సారంగి సందన్న అన్నారు. ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక అంబిటస్ పాఠశాలలో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన, వాటికి ఎదుర్కోవడం ఎలా అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారా అగ్నిప్రమాదాల సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అనే అవగాహన ఉంటే ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యా, వాణిజ్య సముదాయాల్లో అగ్నినిరోదక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంతకు ముందు సిలిండర్ ప్రమాదవశాత్తు పేలినప్పుడు ఎలా నివారించాలో వివరించిన తీరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ట్రెస్మా అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారులు సికిందర్, రాజేశ్ , సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.