ముద్ర కాప్రా
రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్ డివిజన్లలో రూ.8.36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బాక్స్ డ్రైన్లు, బాక్స్ కల్వర్ట్లు, సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, శ్మశాన వాటిక మరమ్మతులు, వెయిటింగ్ హాల్స్, స్టోర్ రూమ్‌లు తదితర మౌలిక వసతుల పనులు ఇందులో భాగంగా చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీ, వర్షపు నీటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.