తెలంగాణను అవమానించిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యాను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి- దత్తాత్రేయ రావు బి.ఆర్ .ఎస్.వి జిల్లా అధికార ప్రతినిధి
ముద్ర, తాండూర్:
తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పోరాటాన్ని అవమానించిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యా ను సస్పెండ్ చేయాలని బి .ఆర్ .ఎస్ .వి యువ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటును భారతదేశం,పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారు పేర్కొన్నారు.
గతంలో మోడీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణను అవమానించింది.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నరని వారు మండిపడ్డారు.
పార్లమెంటులో బి .ఆర్ .ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఈరోజు పార్లమెంట్ ను స్తంభింప చేసేవారని వారు పేర్కొన్నారు.
తెలంగాణకు బి ఆర్ ఎస్ పార్టీ కీ కేసీఆర్ శ్రీ రామరక్షా అని తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు
ఈ దేశంలో ఎవరైనా తెలంగాణను అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు,
తెలంగాణ పోరాటాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని అవమానిస్తే టిఆర్ఎస్ పార్టీ తరపున మరో ఉద్యమానికి సిద్ధమని వారు పేర్కొన్నారు.
తెలంగాణ జాతిపిత, ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన వ్యక్తి.
ప్రధానమంత్రి మోడీ తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ వి యువ నాయకులు షేక్ ఇబ్రహీం, వినోద్ కుమార్,షోహెబ్ అడ్డు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.