కోరుట్ల, ముద్ర;
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కోరుట్ల పట్టణానికి చెందిన సురభి నవీన్ కుమార్ మరోసారి అదృష్టం వరించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురభి నవీన్ తన సొంతూరు కోరుట్ల పట్టణానికి మొదటిసారిగా వస్తున్న సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి కోరుట్ల పట్టణంలోని వారి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. కోరుట్ల బస్ స్టేషన్ ఔట్ గేట్ వద్ద కార్నర్ మీటింగ్ లో కార్యకర్తలను ఉద్దేశించి సురభి నవీన్ కుమార్ మాట్లాడారు. బిజెపి అంటేనే కార్యకర్తల పార్టీ అని కార్యకర్తలు లేకుంటే ఏ నాయకుడు లేడు అని అన్నారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చిన మీ కుటుంబ సభ్యులుగా మీ తోడుంటానని నా చివరి శ్వాస వరకు కాషాయాన్ని విడిచేది లేదని ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎదురొడ్డి పోరాడుతానని తెలియజేశారు. తనపై నమ్మకంతో తనకి రెండవ సారి బాధ్యత ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లకు ధన్యవాదాలు తెలియచేశారు. అనంతర
బిజెపి పార్టీ శ్రేణులు సురభి అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.