Take a fresh look at your lifestyle.

జోగిపేట విద్యుత్ కార్యాలయం ముందు అర్టిజన్ ల నిరవధిక సమ్మె

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టి విఏఈ జెఏసి) ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగింది. బుధవారము జోగిపేట డివిజన్ కార్యాలయం ఎదుట రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు నిరవదిక సమ్మే కార్యక్రమం నిర్వహించారు.ఆర్టిజన్ కార్మికులకు ప్రభుత్వం నిబంధన ప్రకారం ఏపీఎస్సిబి రూల్స్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని మరియు మీటర్ రీడింగ్ వర్కర్లను మరియు పోల్ టు పోల్ వర్కర్లను ఎఫ్ఓసి వర్కర్లను విద్యుత్ సంస్థలను విలీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జోగిపేట డివిజన్ విద్యుత్ కార్మికులకు ఎస్పిడిసిఎల్ కంపెనీ చైర్మన్ వెంకట్ నాయక్,జిల్లా కన్వీనర్ దుర్గ్య నాయక్ డిమాండ్ చేశారు.కార్మికులకు మద్దతుగా కార్యక్రమానికి మద్దతు తెలిపారు.అనంతరం యాజమాన్యం ప్రభుత్వం కరెంట్ కార్మికులకు న్యాయమైన హక్కులు ఇవ్వడానికి వెనుకడవద్దాన్ని 24 గంటలు కుటుంబాలకు దూరంగా ఉంటూ సుదూర ప్రాంతాల్లో నుండి వచ్చి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పని చేస్తున్న కార్మికులకు ఏపిఎస్ ఈ బి రూల్స్ వర్తింప జేయాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ లు రంజిత్,జోగినాథ్,రాజేందర్, సాయిలు,పవన్,నాగరాజు, మల్లేశం,సుధాకర్,హరిక్రిష్ణ, సురేష్,వసీం,ముక్తార్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.