- రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
- రైతులకు సరిపడే ఎరువులు అందించాలి.
- ఇందిరమ్మ ఇల్లా నిర్మాణం త్వరలో పూర్తి చేసుకోవాలి.
- జిల్లా కలెక్టర్ హైమావతి.
ముద్ర, మిరుదొడ్డి: విధి నిర్వహణలో అలసత్వం వహించే క్షేత్రస్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు చూసుకుంటామని కలెక్టర్ హైమావతి అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని లక్ష్మీనగర్, మిరుదొడ్డి గ్రామాలలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బీసీ, ఎస్సీ, వసతి గృహాలతో పాటు పిఎసిఎస్ లో యూరియా విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిఎసిఎస్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న యూరియా క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ కొనసాగించకపోవడం పట్ల సీఈఓ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా విక్రయాలలో పారదర్శకత వహించాలన్నారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇంటి నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి దసరా నాటికి గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధిదారులు త్వరలో నిర్మించుకుంటే దసరాలోపు ఇండ్ల ప్రారంభోత్సవం నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. అరులైన వారు ఈ యొక్క అవకాశాన్ని సృజన చేసుకోవాలని అన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన వారికి ప్రభుత్వం వారి ఖాతాలో నేరుగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విడుదలవారీగా డబ్బులను వారి సొంత ఖాతాలో జమ చేయడం జరుగుతుందని సూచించారు. వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో వచ్చే వారితో వైద్యులు సరియైన వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలో తప్పనిసరిగా ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని వారన్నారు డాక్టర్ అందుబాటులో ఉండి అందరికీ సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన భోజనం అందిస్తూ వారికి హాస్టల్లో అనేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతిరోజు వసతిగృహాలలో మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలని వార్దన్లకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ రాజకుమార్, ఏపీఎం ప్రసాద్, సీసీ వైకుంఠం,దేవ దాస్, ఏపీవో సుభాష్ టెక్నికల్ అసిస్టెంట్ యాదవ రెడ్డి, పరశురాములు, తదితరుల పాల్గోన్నారు.
