- స్మశాన వాటిక వద్ద నిరసన.
ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని తాతా నగర్ వద్ద ఉన్న స్మశాన వాటికలో సమాధులు (గోరీలు) కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన స్మశాన వాటికల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. బుధవారం సమాధులను కూల్చిన స్మశాన వాటిక వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా సమితి నాయకులు పెంట నరసింహ, ఎనబోయిన ఆంజనేయులు, ఉడుత భాస్కర్, సాధు విజయ్ లు మాట్లాడుతూ పట్టణంలోని తాతానగర్ లో 164 సర్వే నంబర్ లో గల ఒక ఎకరం 6 గంటల భూమి లో గత 60 సంవత్సరాల నుండి పట్టణంలోని ముదిరాజ్, గంగపుత్ర కులస్తులు మరణిస్తే ఇక్కడే ఖననం చేసేవారని చెప్పారు. పట్టణం దినదిన అభివృద్ధి చెందటంతో హైదరా బాద్ హనుమకొండ రహదారి ఎడమ వైపు కలిగి ఉన్న సమా ధుల భూములకు రెక్కలు రావడంతో ఈ భూములు తమవే అంటూ తామే పట్టిదారులమంటూ కొందరు స్థానికుల సహకారంతో సమాధులను కూల్చి వేశారని ఆరోపించారు. అప్పట్లో సమాధులు (గోరీల)కోసం ఎకరం 6 గుంటలు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లు అందుకోసం సుమారు 80 నుండి 90 సమాధులను తొలగించారని చెప్పారు.గతంలో కొందరు ముదిరాజుల సమాధులను కూల్చి వేసే ప్రయత్నం చేయగా భువనగిరి టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చార్జీ దాసరి చేసినట్లు అన్నారు. మరొకసారి ఇరువర్గాలు చేసుకున్న ఫిర్యాదుల మేరకు మరో వర్గం వారి పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. రెండు కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ కొందరు నేతల సహకారంతో సమాధుల తొలగించి భూములను అమ్ముకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వాధికారులు అడ్డుకొని భవిష్యత్తు తరాల కోసం వైకుంఠధామంగా ఏర్పాటు చేయాలన్నారు.తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ముదిరాజులు గంగపుత్రుల, ఇతరేతర కులాల బొందల గడ్డ స్థలాలను కాపాడాలన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు బీసుకుంట్ల సత్యనారాయణ, బోయిన బాలయ్య, శాగంటి నరసింహ, గుర్రాల మల్లేష్, శివశంకర్, భగత్, మంద అశోక్, సామల భాస్కర్, గుర్రాల శివ నాగేందర్, నాగరాజు పాల్గొన్నారు.