యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించటం పట్ల హర్షిస్తూ, ఎం.ఆర్.పి.ఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ను సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 365 బై 22 కేంద్ర కమిటీ సభ్యులు బుధవారం శాలువాల కప్పి సన్మానించారు.ఉదయం హైదరాబాద్ లో మంద కృష్ణ ను కలిసిన అసోసియేషన్ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. సింగరేణిలో రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఫలాలు తెలంగాణ రాష్ట్రం అభీష్టం మేరకు అమలయ్యే విధంగా, అసోసియేషన్ పరంగా పర్యవేక్షించాలని మంద కృష్ణ మాదిగ, అసోసియేషన్ నాయకులకు సూచించారు.అలాగే ఎస్సీ వర్గీకరణ ఫలాలు క్రింది స్తాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్తాయి ఉద్యోగుల వరకు అందేలా చూడాలని ఆయన వారిని ఆదేశించారు.మంద కృష్ణ ను కలిసిన వారిలో మాదిగ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పదండి దుర్గ ప్రసాద్, గౌరవ సలహాదారులు కె. రాజేశ్వరరావు, అధ్యక్షులు బొంకూరి మోహన్, శ్రావణ్ కుమార్, కేంద్ర కమిటీ నాయకులు ఏ. చంద్రమౌళి, ఎం.ఎం. కృష్ణ, లతోపాటు వివిధ ఏరియా నుండి వచ్చిన నాయకులు ఉన్నారు.