Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి .-నూతన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లకు సూచించిన పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి

 

ముద్ర, తాండూర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చెంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశేల్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున నూతన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి సమస్యను పరిష్కరించేంతవరకు కలసికట్టుగా పోరాడాలని కౌన్సిలర్లకు చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, నూతన కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.