ముద్ర, జగిత్యాల :
జగిత్యాల కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య వైరం తారాస్ధాయికి చేరుకున్నది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కలకలం రేపగా ఆ మంటలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన సంజయ్ ఆ పై కాంగ్రెస్ లోకి రావడంపై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ఈసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. పోలింగ్‍కు ముందు రాసిన ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.