Take a fresh look at your lifestyle.

సురవరం సుధాకర రెడ్డి లైబ్రరీ కి విరాళం

 

సీఆర్ ఫౌండేషన్ కొండాపూర్ లోని నీలం రాజశేఖర రెడ్డి పరిశోధన కేంద్రం లో ఉన్న సురవరం సుధాకర రెడ్డి లైబ్రరీ ని తెలంగాణ స్టేట్ యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ , ప్రధాన కార్యదర్శి శ్రీ సమద్ ఖాన్, కె . రవీంద్ర బాబు (ఆస్ట్రేలియ) సందర్శించారు.
పరిశోధన కేంద్రం , లైబ్రరీ కార్యకలాపాల గురించి పరిశోధన కేంద్రం కమిటీ సభ్యులు డా. బివి విజయ లక్ష్మి , కన్వీనర్ కంభంపాటి అజయ్ కుమార్ , లైబ్రరీ ఇన్-ఛార్జ్ శ్రీ జి. రాజగోపాల్ రెడ్డి , శ్రీమతి. కె. జ్యోత్స్న వివరించారు.
లైబ్రరీ కి మరిన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచటానికి వీలుగా రవీంద్రనాథ్ గారు, సమద్ గారు వారి యూనియన్ తరుపున రూ 25 వేలు చెక్కు రూపములో విరాళం అందించారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ ప్రముఖ అభ్యుదయ రచయిత శ్రీ. ఏటుకూరి ప్రసాద్ గారు కూడా రూ. 40 వేలు పుస్తకాల కోసం విరాళం అందించారని డా. విజయ లక్ష్మి గారు తెలియచేసి, ఈ విరాళం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.