Take a fresh look at your lifestyle.

రాంరెడ్డి మృతి విద్యార్థి, ఉపాద్యాయ రంగాలకు తీరని లోటు : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్

 ముద్ర, చిట్యాల :
ప్రమోద సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఉపాద్యాయులు కందిమళ్ళ రాంరెడ్డి మరణం విద్యార్థి,ఉపాద్యాయ రంగాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. ఉపాద్యాయ వృత్తి లో అనేక మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన రాంరెడ్డి అన్నారు. ప్రమోద సాహితీ సమితి ద్వారా ప్రతి ఉగాది పండుగ సందర్భంగా కవి సమ్మేళనం తో పాటు, వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను ఆహ్వానించి వారికి సన్మానాలు చేసిన రాంరెడ్డి సేవలు మరువలేనివి అని అన్నారు. వారి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.