Take a fresh look at your lifestyle.

ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ భువనగిరి పట్టణంలో గురువారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం వద్ద జిల్లా కమిషనరేట్ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పూజలు నిర్వహించి కాషాయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంగరంగ వైభవంగా భువనగిరి పురవీధుల గుండా రామనామ స్మరణతో హనుమంతునీ జయ జయ కారలతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో హిందువులు ఐకమత్యంగా ఉండి దేశ విచ్చిన్నకర శక్తులతో ధర్మ వ్యతిరేకులతో పోరాటం చేస్తూ శివాజీ వారసత్వాన్ని ఝాన్సీ లక్ష్మి వీరత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుని భక్తునిగా ధర్మరక్షణలో స్త్రీ రక్షణలో గోరక్షణలో పాల్గొని హిందువుగా జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ తాడెం పాండు, బిజెపి జిల్లా అధ్యక్షులు వూట్కూరి అశోక్, కిరణ్ కుమార్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాఘవేందర్,కార్య అధ్యక్షులు పోలా శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి గీస ఆనంద్, ఉపాధ్యక్షులు చుక్కల శ్రీశైలం, కోశాధికారి చామ రవీందర్, లీగల్ సెల్ కన్వీనర్ సెల్వేరు వేణు, పట్టణ అధ్యక్షులు కందికొండ సహదేవ్, వల్లబోజు సతీష్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ బింగి భరత్ కుమార్, జిల్లా గోరక్ష ప్రముఖ్ నమిలే నవీన్, పట్టణ కన్వీనర్ జడల అక్షయ్, పొన్నాల వినయ్, సూర్వి శ్రీనివాస్, రాకేష్, అరుణ్ పూస శ్రీనివాస్, వివిధ వార్డు ల కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు హిందూ సంఘాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.