తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని వివిధ గ్రామాలలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామెల్
- బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
- కోట్లాది రూపాయల అభివృద్ది నిదులతో తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి.
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్.
తుంగతుర్తి, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు.మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించి ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో రేషన్ బియ్యం పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఎవరు సాహసించి ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు రైతు భరోసా ,రైతు రుణమాఫీ,పథకాలను విజయవంతంగా చేపట్టారని అన్నారు.అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన చాలామంది ప్రజలు వాటిని అంతగా ఉపయోగించడం లేదని తెలుసుకున్న ముఖ్యమంత్రి నేరుగా వారికి అందరితో సమానంగా ఉండడానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని అన్నారు.అందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గం కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.విద్యా వైద్య రవాణా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని అన్నారు.విద్యుత్ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.రానున్న కాలంలో అందరికీ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.ఇప్పటికే వేలాది ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే అన్ని గ్రామాల్లో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.సన్న బియ్యం పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లతోపాటు ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అధికారులు ప్రజానీకం పాల్గొన్నారు.
