Take a fresh look at your lifestyle.

మొదటి విడత 36 మందికి ఓకే : – మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ జాబితా విడుదల

 

 

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల
మొదటి విడత జాబితా విడుదల చేశారు.ఈ పార్టీ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు 216 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో మొదటి విడుతలో 36 మందికి డీసీసీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ బీ పారాలు అందజేశారు. ఇంకా 24 మంది అభ్యర్థులకు బీ పారాలు దక్కలేదు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండడం తో నామినేషన్ల వేసి వారు బీ పారం వస్తుందో లేదోనని డోలాయాణం ఉన్నారు.
216 మంది కాంగ్రెస్ అభ్యర్థులు టికెట్లు ఆశించినప్పటికీ 60 మందిని ఖరారు చేయవలసి ఉండగా మొదటి విడతగా 36 మందిని ఖరారు చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కకార్యకర్తల కృషి చేయాలని కోరారు.. పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయాలన్నారు.బీ పారాలు రానివారు అసంతృప్తి చెందవద్దని సంజీవ్ విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల అన్ని వివరాలు తీసుకుని బీ పారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు

Leave A Reply

Your email address will not be published.