ముద్ర కూకట్‌పల్లి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహించనున్న భారీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ కోరారు.
శుక్రవారం హైటెక్స్‌లోని కమిషనర్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన బండి రమేష్, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేశారు.
రోడ్ నెంబర్ 1, హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్, కేపీహెచ్‌బీ కాలనీ.
మార్చి 8వ తేదీ (ఆదివారం). ఆహ్వానంతో పాటు కూకట్‌పల్లి పరిధిలోని పలు స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు బండి రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం శ్రీరంగం, గాలి బాలాజీ, తూము వేణు, శేరి సతీష్ రెడ్డి, సాదు ప్రతాప్ రెడ్డి, కొప్పిశెట్టి దినేష్ కుమార్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కృష్ణ రాజ్ పుత్, రంగమోహన్, మస్తాన్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.